" PRAISE THE LORD http://prasade.webs.com/ "

Monday, September 10, 2007

చింతించుటేలా నాప్రాణమా

చింతించుటేలా నాప్రాణమా -2
చింతపడుటవల్ల నీకు లాభమా -2
చింతలన్ని మోసే ఏసు ఉండగా -2
చింతపడుటమాని సంతషించుమా -2 "చింతించుటేలా"

మబ్బుకమ్మిన గడ్డు దినమున నిస్సారమును కలిగిస్తాడు
అడ్డు వచ్చిన ముళ్ళ కంచెలు అవలీలగ దాటిస్తాడు
కష్టాల కొండలలో మోకాళ్ళు వంచితే -2
మార్గాలన్నిటిని తిన్నగ చేస్తాడు "చింతించుటేలా"

దిగులు కలిగిన ప్రతి సమయములో వాగ్ధానము పంపిస్తాడు
భయము పెరిగిన ప్రతికూలతలోతన కృపను చూపిస్తాడు
నష్టాల లోయలలో సణగక సాగితే -2
దీవెనలు పంపి సమృద్ధినిస్తాడు "చింతించుటేలా"

0 comments: