" PRAISE THE LORD http://prasade.webs.com/ "

Sunday, September 16, 2007

సంగీత నాధముతో స్తోత్రసంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గొప్ప కార్యం చాటెద

సంగీత నాధముతో స్తోత్రసంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద, నీ గొప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చినా యేసయ్య - ఈనీరుణం తీర్చుట ఎటులయా -"సంగీత నాధముతో "

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి-కలువలు పూయించిన కృపలను కొనియాడెద-2
పాపములు క్షమియించి నను మార్చినా-దోషములు భరియించి దరిచేర్చినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి- విడువక నడిపిచిన విధమును వివరించెద - 2
క్షేమమును కలిగించి నను లేపినా- దీవెనలు కురిపించి కృపచూపినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

నా దుఖః దినములలో ఓదార్పును కలిగించి -కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెద - 2
వాక్యముతో దర్శించి బలపరచినా- సత్యముతో సంధించి స్ధిరపరచినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

0 comments: