మానస వీణను శృతిచేసి - మనస్సు నిండ కృతఙత నింపి
గొంతెత్తి స్తుతి గీతములే పాడవా - వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా "మానస వీణను "
వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా - సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా-2
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం-2
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం "మానస వీణను "
శ్రమలతో తడబడితే ప్రార్దనతో సరిచేయి- దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీ-2
మనమే జగతికి వెలుగిస్తే -విశ్వాస గణాలు ఫలిస్తే-2
స్తుతి ధూపం పైపై కెగసి దీవెనలే రక్షింపవా "మానస వీణను "
Monday, September 10, 2007
మానస వీణను శృతిచేసి
Posted by Satish at 4:37 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment