దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్.. నిన్ను స్తుతియించెదన్
నావా ఒంటరిగా సాగుచుండగా - నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరినిగూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణా నాధుడా నా జీవా నాధుడా
దేహమంత కృషియిచినా
వాడి నశియించి పోయిన
రక్తధారలై ప్రవహించినా మరణమాసన్నమైనను
క్షణమైన నిన్ను స్తుతియింప మరచిన
జీవిత పయనము వ్యర్ధమయ్య
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణా నాధుడా నా జీవా నాధుడా
Tuesday, September 11, 2007
దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
Posted by
Satish
at
1:45 PM
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment