నా ఆశ్రయమా నా ఆధారమా నా అణువణువునా నీవే - 2
నా దాగు చోటు నీవే ప్రభువా - ఆనుకొనెదనూ అలయక నిరతం - 2 "నా ఆశ్రయమా"
ఆవరించెను ఆపదలెన్నో- కాపుకాచెను కష్టములెన్నో - 2
అరుదెంచితివా ఆదరించనూ - దాపుచేరితివా దారిచూపనూ
అతిప్రియుడా దయామయుడా - 2 "నా ఆశ్రయమా"
ఆశల వలయాలు నన్నల్లుకొనగా - నిరాశలనీడలు నిదురలేపగా - 2
వడివడిగా ఆలోచన జాడలు - చూపితివే ప్రభూ నా ఆశ నీవే
ఉన్నవాడా దయామయుడా - 2 "నా ఆశ్రయమా"
Saturday, September 1, 2007
నా ఆశ్రయమా నా ఆధారమా
Posted by Satish at 11:21 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment