" PRAISE THE LORD http://prasade.webs.com/ "

Sunday, September 16, 2007

సంగీత నాధముతో స్తోత్రసంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గొప్ప కార్యం చాటెద

సంగీత నాధముతో స్తోత్రసంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద, నీ గొప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చినా యేసయ్య - ఈనీరుణం తీర్చుట ఎటులయా -"సంగీత నాధముతో "

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి-కలువలు పూయించిన కృపలను కొనియాడెద-2
పాపములు క్షమియించి నను మార్చినా-దోషములు భరియించి దరిచేర్చినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి- విడువక నడిపిచిన విధమును వివరించెద - 2
క్షేమమును కలిగించి నను లేపినా- దీవెనలు కురిపించి కృపచూపినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

నా దుఖః దినములలో ఓదార్పును కలిగించి -కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెద - 2
వాక్యముతో దర్శించి బలపరచినా- సత్యముతో సంధించి స్ధిరపరచినా
నీ ప్రేమ గీతం పాడెద- నీ గొప్ప కార్యం చాటెద

Saturday, September 15, 2007

నీ ఆరాధనా హృదయ ఆలాపనా

నీ ఆరాధనా హృదయ ఆలాపనా

ఆత్మతో సత్యముతో - 2

ఆరాధించెదనూ ఆరాధించెదనూ

ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధనా తండ్రి ఆరాధనా

నీ ఆరాధనా

అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన - 2

దినమెల్ల నీనామం కీర్తించినా నా ఆశతీరునా - 2

ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధనా తండ్రి ఆరాధనా

నీ ఆరాధనా


స్తోత్రము చేయు పెదవులతో తంబుర సితారనాదముతో-2

విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు - 2

ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధనా తండ్రి ఆరాధనా

నీ ఆరాధనా

Tuesday, September 11, 2007

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్.. నిన్ను స్తుతియించెదన్

నావా ఒంటరిగా సాగుచుండగా - నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరినిగూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద

ప్రాణా నాధుడా నా జీవా నాధుడా

దేహమంత కృషియిచినా
వాడి నశియించి పోయిన
రక్తధారలై ప్రవహించినా మరణమాసన్నమైనను
క్షణమైన నిన్ను స్తుతియింప మరచిన
జీవిత పయనము వ్యర్ధమయ్య
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణా నాధుడా నా జీవా నాధుడా




Monday, September 10, 2007

చింతించుటేలా నాప్రాణమా

చింతించుటేలా నాప్రాణమా -2
చింతపడుటవల్ల నీకు లాభమా -2
చింతలన్ని మోసే ఏసు ఉండగా -2
చింతపడుటమాని సంతషించుమా -2 "చింతించుటేలా"

మబ్బుకమ్మిన గడ్డు దినమున నిస్సారమును కలిగిస్తాడు
అడ్డు వచ్చిన ముళ్ళ కంచెలు అవలీలగ దాటిస్తాడు
కష్టాల కొండలలో మోకాళ్ళు వంచితే -2
మార్గాలన్నిటిని తిన్నగ చేస్తాడు "చింతించుటేలా"

దిగులు కలిగిన ప్రతి సమయములో వాగ్ధానము పంపిస్తాడు
భయము పెరిగిన ప్రతికూలతలోతన కృపను చూపిస్తాడు
నష్టాల లోయలలో సణగక సాగితే -2
దీవెనలు పంపి సమృద్ధినిస్తాడు "చింతించుటేలా"

మానస వీణను శృతిచేసి

మానస వీణను శృతిచేసి - మనస్సు నిండ కృతఙత నింపి
గొంతెత్తి స్తుతి గీతములే పాడవా - వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా "మానస వీణను "

వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా - సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా-2
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం-2
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం "మానస వీణను "

శ్రమలతో తడబడితే ప్రార్దనతో సరిచేయి- దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీ-2
మనమే జగతికి వెలుగిస్తే -విశ్వాస గణాలు ఫలిస్తే-2
స్తుతి ధూపం పైపై కెగసి దీవెనలే రక్షింపవా "మానస వీణను "

Monday, September 3, 2007

ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగెదమా

ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగెదమా
అందరితోను ప్రతివిషయములో క్రీస్తువలే మెలగెదమా

హల్లెలూయ-హల్లెలూయ-హల్లెలూయ- హల్లెలూయ - 2

క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం - క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాదారం - 2
క్రీస్తుయేసుతో నడచుచూ క్రీస్తు ప్రేమను చాటెదమా - 2
హల్లెలూయ- హల్లెలూయ-హల్లెలూయ -హల్లెలూయ - 2

శిరసై క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమం సాధ్యం -సంఘము నందు అవయములై సహకరించుచు సాగెదం - 2
సార్వత్రికా సంఘముగాసత్యసువార్తను చాటెదమా - 2

హల్లెలూయ -హల్లెలూయ-హల్లెలూయ -హల్లెలూయ - 2




Sunday, September 2, 2007

నిను స్తుతియించెదం దేవా

నిను స్తుతియించెదం దేవానినుఘనపరచెదం ప్రభువా-2

నీసన్నిధానములోనిలచివినయముగాశిరస్సువంచి
నిను స్తుతియించెదం

నీ రూపమునందు నేలమంటితోనను చేసినది నీవే-2
ఏరూపమునాకు లేకముందే ననుచూసినది నీవే
నిను స్తుతియించెదం

నీఅరచేతియందు నారూపమునుముద్రించినది నీవే-2
ఏశత్రువు చేతిలో చిక్కకుండా ననుకాచినది నీవే
నిను స్తుతియించెదం

నీవే ప్రభువా నమ్మదగిన వాడవు

నీవే ప్రభువా నమ్మదగిన వాడవు
అంటియుండు ఎపుడు నిన్ నాదు ప్రాణము "నీవే ప్రభువా "

నీ వాగ్ధానముల్ నమ్మదగినవి మార్పులేనివి మారిపోనివి
శోధనలో శోకములో ఆదరించును "నీవే ప్రభువా "

నీస్వభావము నమ్మదగినది మోసమెన్నడు కానరానిది
నరులలోన మార్పులున్న నీవు మారవు "నీవే ప్రభువా "

నీ కార్యముల్ నమ్మదగినవి సాతానుచే మార్చలేనివి
ఆత్మతోను శక్తితోను నీవు చేతువు "నీవే ప్రభువా "

Saturday, September 1, 2007

ఈస్తుతి నీకేమాఏసుదేవా

ఈస్తుతి నీకేమాఏసుదేవా మనసార నిన్నే సేవింతుము
మా మనసార నిన్నే సేవింతుము
పరలోకదూతాళి స్తోత్రాలతోనేమాస్తోత్రగానాలు గైకొనుమా-2

జగతికి పునాది నీవనిమాలోనిఊపిరి నీవేనని
మాపోషకుడవు నీవేననీమాకాపరివి నీవేననీ
మాహృదయాలలో ఉన్నావనినీసాక్షిగామేము బ్రతకాలనీ

మనసార నీదరిచేరగామాకెంతొ సంతోషమాయెగా
శతకోటి స్తుతి మధుర గీతాలతోమాహృది ప్రవహించె సెలయేరులా
నీమధుర సేవను చేయాలనినీజీవబాటలో నడవాలనీ

నా ఆశ్రయమా నా ఆధారమా

నా ఆశ్రయమా నా ఆధారమా నా అణువణువునా నీవే - 2
నా దాగు చోటు నీవే ప్రభువా - ఆనుకొనెదనూ అలయక నిరతం - 2 "నా ఆశ్రయమా"

ఆవరించెను ఆపదలెన్నో- కాపుకాచెను కష్టములెన్నో - 2
అరుదెంచితివా ఆదరించనూ - దాపుచేరితివా దారిచూపనూ
అతిప్రియుడా దయామయుడా - 2 "నా ఆశ్రయమా"

ఆశల వలయాలు నన్నల్లుకొనగా - నిరాశలనీడలు నిదురలేపగా - 2
వడివడిగా ఆలోచన జాడలు - చూపితివే ప్రభూ నా ఆశ నీవే
ఉన్నవాడా దయామయుడా - 2 "నా ఆశ్రయమా"