" PRAISE THE LORD http://prasade.webs.com/ "

Wednesday, August 29, 2007

నా స్వాస్ధ్యమా నా అతిశయమా

నా స్వాస్ధ్యమా నా అతిశయమా - 2
ఏసయ్య నీకృప ఇలలో చాలునయా - 2

తోడులేక విలపిస్తూ మూల్గుతున్న గువ్వ వలే

ఒంటరైన ఈ బ్రతుకుననే మిగిలియున్నఈధరణిలో - 2
నాస్ధితిని గమనించి నన్నుచేరిన ఏసయ్యా
ఓదేవా ఇవిగోనాదీనమైన స్తోత్రములు - 2

నాగూటిని సరిచేసి నన్ను నిలిపిన నాప్రభు

నీకోసమె జీవించగనే నన్ను చేరుకొంటివా - 2
నాతోడుగా నీవుండి నానీడవైన ఏసయ్య
ఓదేవా ఇవిగోనాదీనమైన స్తోత్రములు - 2

నీతోనే నా జీవితం కడదాక సాగనీయుమా

నీతోనే నా జీవితం కడదాక సాగనీయుమా - 2
నీ ప్రేమతోనే నన్ను నింపుమా
నీ సాక్షిగానే నన్ను పంపుమా "నీతోనే నా జీవితం "

పిలిచావు నన్ను నీకోసమే - నిలిపావు ఇల నన్ను నీ సేవలో - 2
నీ ఆత్మతోనే నన్ను నింపుమా - నీ ఆత్మతోనే నన్ను నడుపుమా - 2 "నీతోనే నా జీవితం "

నన్నెంతగానో ప్రేమించావు - నాకై ఇలకేగి మరణిచావు - 2
నీ కల్వరి ప్రేమనే నే మరతునా - నీ కోసమే నన్ను ఇల పంచుమా - 2 "నీతోనే నా జీవితం "

Sunday, August 26, 2007

కన్నుల నిండా నీ రూపం

కన్నుల నిండా నీ రూపం
కదలాడెను ప్రతినిత్యం
అపురూపం నీతో స్నేహమే
హృదయంలోన నీ ధ్యానం
పెదవులపై నీ స్తుతిగీతం
నీ కోసం నా సంగీతమే...
ఏసు నీతోడే నాకుంటె అర్ధం
నీవే లేకుంటె నా బ్రతుకు వ్యర్థం "కన్నుల నిండా "

యోగ్యతే లేని నాకోసం కార్చితివి నీదు రక్తం - 2
పవిత్ర పరచి సమస్తమిచ్చి నీ కౌగిట చేర్చినావు - 2
నీ మందలో కూర్చినావు
నీ రూపుకు మార్చినావు "కన్నుల నిండా "

శాశ్వతమైన నీప్రేమనూ విడువని నీదు కృపనూ - 2
దవళవర్ణుడా రత్నవర్ణుడా ఎల్లప్పుడు ధ్యానించెదను - 2
నిన్నేనే అనుసరింతునూ
నీ నీడలో జీవించెదనూ "కన్నుల నిండా "

Saturday, August 25, 2007

విజయ గీతిక మ్రోగింది కలువరి శిలువలో

విజయ గీతిక మ్రోగింది కలువరి శిలువలో
విజయ పతాకా ఎగిరింది పునఃరుధ్దానములో 2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా -2 "విజయ గీతిక"
మరణమే మరణించింది సాతాను తలదించింది -2

క్రీస్తుయేసు మృత్యువును గెల్చుట నిరీక్షణను కలిగించింది -2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా -2 "విజయ గీతిక"
తండ్రి మహిమ రుజువైయ్యింది కృపపాలన మొదలైంది -2

సమాధి గుండెను ఏసుచీల్చుట విశ్వాసికి బలమిచ్చింది -2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా -2 "విజయ గీతిక"

Wednesday, August 22, 2007

మహొన్నతుడా మా దేవా సహాయకుడా యెహొవా

మహొన్నతుడా మా దేవా సహాయకుడా యెహొవా - 2
ఉదయకాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము - 2
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు - 2
అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

జలముల ధ్వనివంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం - 2
ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా - 2
పాతాళలోకపు తాళపుచెవులు కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"

హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ - 2



Tuesday, August 21, 2007

విధేయతకే అర్థము చెప్పిన వినయ మనష్కుడా

విధేయతకే అర్థము చెప్పిన వినయ మనష్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కోమరుడా
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"

పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతిచర్య జరిగించగ పగవారిని క్షమియించిన ప్రేమదీప్తివి - 2
శిలువ మరణము పొందునంతగ నీవే తగ్గించు కొంటివి అధికముగా హెచ్చింప బడితివి
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"

పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువ బడితివి రక్షణకు కారకుడవైతివి
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"


ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం

ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం - 2
ఆరాధించెద నిన్నే నిత్యం - 2 'ఆరంభించెద

నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం - 2
నింపును నాలో నూతన ధైర్యం - 2 'ఆరంభించెద

నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెద నీ కృప కోసం
వేకువ జామున నీ ముఖదర్శనం - 2
పెంచును నాలో ఆత్మవిశ్వాసం - 2 'ఆరంభించెద

నా పెదవులతో ప్రతినిమిషం స్తుతియించెద నీ ఘననామం
దినప్రారంభమున నీ ప్రియజ్ఞానం - 2
కాల్చును నాలో అహము సర్వం - 2 'ఆరంభించెద