విధేయతకే అర్థము చెప్పిన వినయ మనష్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కోమరుడా
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"
పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతిచర్య జరిగించగ పగవారిని క్షమియించిన ప్రేమదీప్తివి - 2
శిలువ మరణము పొందునంతగ నీవే తగ్గించు కొంటివి అధికముగా హెచ్చింప బడితివి
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"
పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువ బడితివి రక్షణకు కారకుడవైతివి
అవిధేయత తొలగించుమయా నీ ధీనమనస్సు కరిగించుమయా - 2 "విధేయతకే"
Tuesday, August 21, 2007
విధేయతకే అర్థము చెప్పిన వినయ మనష్కుడా
Posted by Satish at 1:16 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment