" PRAISE THE LORD http://prasade.webs.com/ "

Sunday, August 26, 2007

కన్నుల నిండా నీ రూపం

కన్నుల నిండా నీ రూపం
కదలాడెను ప్రతినిత్యం
అపురూపం నీతో స్నేహమే
హృదయంలోన నీ ధ్యానం
పెదవులపై నీ స్తుతిగీతం
నీ కోసం నా సంగీతమే...
ఏసు నీతోడే నాకుంటె అర్ధం
నీవే లేకుంటె నా బ్రతుకు వ్యర్థం "కన్నుల నిండా "

యోగ్యతే లేని నాకోసం కార్చితివి నీదు రక్తం - 2
పవిత్ర పరచి సమస్తమిచ్చి నీ కౌగిట చేర్చినావు - 2
నీ మందలో కూర్చినావు
నీ రూపుకు మార్చినావు "కన్నుల నిండా "

శాశ్వతమైన నీప్రేమనూ విడువని నీదు కృపనూ - 2
దవళవర్ణుడా రత్నవర్ణుడా ఎల్లప్పుడు ధ్యానించెదను - 2
నిన్నేనే అనుసరింతునూ
నీ నీడలో జీవించెదనూ "కన్నుల నిండా "

0 comments: