మహొన్నతుడా మా దేవా సహాయకుడా యెహొవా - 2
ఉదయకాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము - 2
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"
అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు - 2
అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"
జలముల ధ్వనివంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం - 2
ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"
ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా - 2
పాతాళలోకపు తాళపుచెవులు కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా - 2 "మహొన్నతుడా"
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ - 2
Wednesday, August 22, 2007
మహొన్నతుడా మా దేవా సహాయకుడా యెహొవా
Posted by Satish at 10:54 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment