" PRAISE THE LORD http://prasade.webs.com/ "

Tuesday, October 23, 2007

జుంటెతేనె ధారలకన్న

జుంటెతేనె ధారలకన్న ఏసునామమే మధురం
ఏసయ్య సన్నిధినే మరువజాలను
జీవితకాలమంతా ఆనందించెదాఏసయ్యనే ఆరాధించెదా-2
ఏసయ్య నామమె బహుపూజనీయము

నాపై దృష్టినిలిపి సంతృష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించిజీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెను -2
ఏసయ్య నామమె బలమైన దుర్గము

నాతోడైనిలిచి క్షేమముగా ననుదాచి
నన్నెంతగానో కరుణించిపవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే-2
ఏసయ్య నామమె పరిమళతైలము

నాలోనివశించి సువాసనగా ననుమార్చి
నన్నెంతగానో ప్రేమించివిజయోత్సవాలతో ఊరేగింపచేసెనే -2

ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఏసయ్యా నీలో-2
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము - 2

పచ్చికగల చోట్ల పరుండచేసితివే - జీవజలములు త్రాగనిచ్చితివే -2

నాప్రాణమునకు సేదదీర్చితివే - నీతియు శాంతియు నాకిచ్చితివే -2

గాఢందకారపు లోయలలో నేను - సంచరించిన దేనికి భయపడను-2

నీదుడ్డుకర్రయు నీదండమును - అనుదినం అనుక్షణం కాపాడునే -2

నా శత్రువుల ఎదుటే నీవూ - నాకు విందును సిద్ధము చేసావు -2

నీతోనేను నీమందిరములో - నివాసము చేసెద చిరకాలము -2

నీకంటె నమ్మదగిన దేవుడెవరయా

నీకంటె నమ్మదగిన దేవుడెవరయా-నీవుంటే నాతో ఏ భయము లేదయా -2
'మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా-కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతాడయా' "నీకంటె"

కొట్టబడినవేళ నా గాయం కట్టినావే ....2
బాధించిన స్వస్తపరచేది నీవే..2 "నీకంటె"

అనచబడినవేళ నాకాళ్ళను ఎత్తినావే....2
శిక్షించినా గొప్పచేసేది నీవే..2 "నీకంటె"

విడువబడినవేళ ననుచేరదీసినావే....2
కోపించిన కరుణచూపేది నీవే..2 "నీకంటె"

యేసు క్రీస్తు పిలుపును అంగీకరించావా

యేసు క్రీస్తు పిలుపును అంగీకరించావా
యేసులోని పిలుపును అనుభవించు చున్నావా "యేసు క్రీస్తు"
శక్తిగల ఆ నామంలో విశ్వాసముంచావా -2
భక్తితో తన చిత్తముకై నీ శిరము వంచావా -2

చీకటి నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలిచిన దేవుని
హృదయములోనికి ఆహ్వానించిన
చీకటి బ్రతుకు వెలిగించ బడును


ఉన్నతుడైన పరలోక దేవుడు తన సేవ కొరకు పిలిచిన పిలుపు
గ్రహియించి ఆయన శిలువను మోసిన
నీ జీవితము ఫలవంతమగును


తన సన్నిధికి తిరిగి రమ్మని సృష్టికర్తయే పిలిచే పిలుపు
తెలియదు ఎపుడు సిద్ధపడియుండిన
పరలోకములో స్ధానము దొరకును