జుంటెతేనె ధారలకన్న ఏసునామమే మధురం
ఏసయ్య సన్నిధినే మరువజాలను
జీవితకాలమంతా ఆనందించెదాఏసయ్యనే ఆరాధించెదా-2
ఏసయ్య నామమె బహుపూజనీయము
నాపై దృష్టినిలిపి సంతృష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించిజీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెను -2
ఏసయ్య నామమె బలమైన దుర్గము
నాతోడైనిలిచి క్షేమముగా ననుదాచి
నన్నెంతగానో కరుణించిపవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే-2
ఏసయ్య నామమె పరిమళతైలము
నాలోనివశించి సువాసనగా ననుమార్చి
నన్నెంతగానో ప్రేమించివిజయోత్సవాలతో ఊరేగింపచేసెనే -2
Tuesday, October 23, 2007
జుంటెతేనె ధారలకన్న
Posted by Satish at 4:46 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment