నీదు ప్రేమకు హద్దులేదయా - నీదు ప్రేమకు కొలతలేదయా
నీదు ప్రేమకు సాటిరారయా ఎవ్వరూ..
పొగడ దగిన ప్రేమమూర్తివి నీవయా - యేసయ్యా "నీదు ప్రేమకు"
తల్లితండ్రులు చూపలేని ప్రేమా....
తనయులివ్వని తేటనైన ప్రేమా
పేదలకు నిరుపేదలకును - విధవలకు అనాధలకును
బంధుమిత్రులు చూపలేని ప్రేమా... ఆ.. ఆ..ఆ..- 2
కొనియాడ దగిన ప్రేమమూర్తివి నీవయా - యేసయ్యా "నీదు ప్రేమకు"
నరులకే నరరూపివైన ప్రేమా..ఆ..
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమా
దొంగలకు వ్యభిచారులకును - కౄరులకు నరహంతకులకు
మనిజులివ్వని మధురమైన ప్రేమా... ఆ.. ఆ..ఆ..- 2
కీర్తింపదగిన ప్రేమమూర్తివి నీవయా - యేసయ్యా "నీదు ప్రేమకు"
Tuesday, April 1, 2008
నీదు ప్రేమకు హద్దులేదయా
Posted by Satish at 11:57 AM 2 comments
Subscribe to:
Posts (Atom)